KMR: బిచ్కుంద మండలం బండరెంజల్ గ్రామ చెరువులో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నీటిలో శవం తేలియాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని అదే గ్రామానికి చెందిన చాకలి సంతోన్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.