ప్రైవేట్ ట్రావెల్స్ అనేది.. దేశంలోనే అతిపెద్ద మాఫియా అని ప్రైవేట్ ట్రావెల్స్ బాధితుడు సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రైవేట్ బస్సుల ప్రమాదాలకు ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నాయి. ఏసీ బస్సుల్లో 32 సీట్లకు మించొద్దు. మరి 42 మంది ఎలా ఉన్నారు. ఎక్కడో రిజిస్టరైన బస్సుల్ని ఏపీ, తెలంగాణలో ఎందుకు అనుమతిస్తున్నారు. సీటర్ పర్మిషన్ తీసుకుని స్లీపర్‌గా నడుపుతారు’ అని అన్నారు.