GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు వద్ద అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆచూకీ తెలిసినవారు వెంటనే ఫిరంగిపురం పోలీసులను సంప్రదించాలని సీఐ శివరామకృష్ణ కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.