ప్రకాశం: తర్లుపాడు మండల కేంద్రం నుంచి మార్కాపురం పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిపై సీతానాగులవరం గ్రామానికి సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కీలకమైన రహదారిలో రోడ్డు మార్జిన్ లేకపోవడం, దానికి తోడు ఇరువైపులా చిల్ల చెట్లు దట్టంగా, ఎత్తుగా పెరిగిపోవడం వల్ల వాహనదారులకు రాకపోకలు కష్టంగా మారి.. నిత్యం ప్రమాదం పొంచి ఉంది.