JN: పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జనగామ మండలంలోని,ఓబుల్ కేశవాపూర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీస్‌లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించి వారు మాట్లాడారు. మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 గా ఉందన్నారు.