AP: రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు, సెంటున్నర స్థలాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఆ స్థలాలకు బదులుగా 2, 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంపై కూడా యోచిస్తున్నట్లు చెప్పారు.