NZB: నగరపాలక సంస్థ పనితీరు మెరుగుపడాలని, నగర రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా పనిచేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పచ్చదనం పెంపొందించడం, పారిశుధ్య నిర్వహణ, బల్దియా ఆస్తుల పరిరక్షణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.