ADB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారులు స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం,మన బడి–మన నీరు,నర్సరీలు, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశంలో దిశ నిర్దేశం చేశారు.