ASR: రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండల పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. 11కేవీ ఇందుకూరుపేట, మారేడుమిల్లి, 33కేవీ ఫీడర్లలో లైన్ మరమ్మతులు, ట్రీ ట్రిమ్మింగ్ పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీ.వీ. రమణ తెలిపారు. వినియోగదారులు సహకరించాలన్నారు.