కన్నడ బిగ్బాస్ ఫేమ్, ప్రముఖ నటి దివ్య సురేష్ వివాదంలో చిక్కుకుంది. ఈ నెల 4న ఉదయం బెంగుళూర్లో బైక్ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్లు సమాచారం. బైతరాయణపుర నిత్య హోటల్ సమీపంలో దివ్య కారు ఓ బైకును ఢీకొట్టి వెళ్లిపోయిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.