మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మూడో వన్డే మ్యాచ్ సిడ్నీలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసిస్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే, టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. వారిద్దరిని పక్కన పెట్టి కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించింది.