ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన లారీలో నుంచి బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. స్థానిక బొక్కలగూడ కాలనీకి చెందిన రిజ్వాన్‌కు చెందిన లారీలో నుంచి రెండు బ్యాటరీలు చోరీ అయినట్లు టూటౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు. ఈ విషయమై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.