TG: మేడ్చల్ మూసాపేట పరిధిలోని గూడ్స్ షెడ్ రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ప్రమాదం సంభవించింది. గోదాములో నిల్వ ఉంచిన రసాయనాల విభాగంలో మంటలు చెలరేగాయి. పరిసరాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు పొగతో ఇబ్బందులు పడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.