KNR: తిమ్మాపూర్ మండలం LMD కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ సుధారాణి తెలిపారు. 18-45 సంవత్సరాల మహిళలకు టైలరింగ్, జూట్ బ్యాగ్ తయారీ, ఈ-ఆటో డ్రైవింగ్, ప్రీ-ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ వంటి కోర్సుల్లో 2 నెలలపాటు శిక్షణతో పాటు ఉచిత హాస్టల్ ఉంటుంది. NOV 7 లోపు దరఖాస్తు చేసుకోగలరు.