ప్రకాశం: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కంభం మండలంలోని తురిమెళ్ళ గ్రామ సమీపంలో గల చెరువు వద్ద శనివారం ఎంపీడీవో వీరభద్రాచారి భద్రతా చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల చెరువు నీటి మట్టం పెరగడంతో భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు..