ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం విద్యాధికారి పవార్ అనిత సందర్శించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయుల బోధనా పద్ధతిని పరిశీలించి సలహాలు, సూచనలిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు నీటితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HM ప్రభాకర్, రాథోడ్ రాజ్ కుమార్, అశ్విన్ పాల్గొన్నారు.