SDPT: చేప పిల్లల పంపిణీకి జిల్లా మత్స్యశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. మత్స్యకారుల సొసైటీలకు గ్రామాలలోని చెరువుల్లో చేపలు ఉచితంగా పంపిణీ చేసి, విక్రయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో 379 సొసైటీలుండగా 24,601 మంది సభ్యులు ఉన్నారు. 3,256 చెరువులకు గానూ 1,715 చెరువుల్లో కట్ల, రవ్వ, బంగారుతీగ వంటి రకాలకు చెందిన 4.42 కోట్ల పిల్లలను పంపిణీ చేయనున్నారు.