ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి బేబీ రాణి మౌర్యాకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.