కృష్ణా: ప్రభుత్వం నియమించిన పెడన మార్కెట్ యార్డ్ నూతన ఛైర్మన్గా భీముని అనంతలక్ష్మి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని, మార్కెట్ యార్డ్ చైర్మన్ భీముని అనంతలక్ష్మి, డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం ఉంటుందని తెలిపారు.