PPM: మద్యానికి బానిసైన కొచ్చర్ల సుధీర్ కుమార్(30) ఆత్మహత్యకు పాల్పడినట్లు కొమారడ ఎస్ఐ నీలకంఠం తెలిపారు. పార్వతీపురం మండలం కోటవానివలసకు చెందిన సుధీర్ మద్యానికి బానిసవ్వడంతో భార్యతో గత కొద్ది రోజులుగా మనస్పర్థులు వచ్చాయి. దీంతో ఆమె కన్నవారింటికి వెళ్ళిపోయింది. మనస్థాపానికి గురైన సుధీర్ విక్రాంపురం సమీపంలోని తోటలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు చేసుకొన్నాడు.