KMM: ఖమ్మం నగరంలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలపై ఈనెల 29న ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు CPM డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ తెలిపారు. ఖమ్మం వైరా రోడ్ రామకృష్ణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులకు కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందక నష్టపోవాల్సి వస్తుందన్నారు.