KKD: యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ హైస్కూల్ పక్కన ఉన్న కాలువలో శనివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు అమీనాబాద్ గ్రామానికి చెందిన డి. ఆంధ్రయ్య (55) గా పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.