AP: కర్నూలు బస్సు ప్రమాదం మృతదేహాల అప్పగింతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 19 మృతదేహాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉన్నాయి. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా.. బొగ్గులా మారిపోయాయి. డెడ్‌బాడీలను గుర్తించాలంటే DNA పరీక్షలే కీలకంగా మారాయి. 19 మృతదేహాల నుంచి ఇప్పటికే శాంపిల్స్ తీసుకున్నారు. సరిపోల్చేందుకు మరణించిన కుటుంబాలకు చెందిన 12 మంది DNA శాంపిల్స్ సేకరించారు.