ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలిక వసతి గృహం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి నోచుకోవడం లేదు. భారత్ డైనమిక్ లిమిటెడ్ వారి సౌజన్యంతో బాలికల విద్యాభివృద్ధి కొరకు 2023లో నిర్మాణం చేపట్టి భవన సముదాయం పూర్తి చేయడం జరిగింది. ప్రారంభానికి నోచుకోక బిల్డింగ్ చుట్టూ ముళ్ళ పొదలతో చిత్తడిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది.