AP: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సినీ నటి రష్మిక మందన్న సంతాపం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాద వార్త విని నా హృదయం ముక్కలైంది. మండుతున్న బస్సు లోపల ఆ ప్రయాణికులు అనుభవించిన బాధను తలుచుకుంటే భయంకరంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని పోస్ట్ పెట్టారు.