HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగియడంతో రాజకీయం వాతావరణం వేడెక్కింది. పోటాపోటీగా అభ్యర్థులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఎత్తులకు పైఎత్తులతో ప్రతి అంశాన్ని అణువుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.