GNTR: తెనాలిలోని రైతు బజార్ల నిర్వహణ లోపంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. చెంచుపేట రైతు బజార్ బురదమయంగా మారి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారి పక్కనే పార్కింగ్ సౌకర్యం లేక వాహనాలను రోడ్డుపై నిలుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జీడీసీసీ బజార్ వద్ద కూడా నీరు నిలిచిపోతోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, వనియోగదారులు కోరుతున్నారు.