కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 73 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 59 నామినేషన్లు ఆమోదం పొందాయని ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ తెలిపారు. వివిధ కారణాల వల్ల 14 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నేడు (శనివారం) నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుందని అన్నారు.