జగిత్యాల పురపాలక సంఘం పారిశుధ్య కార్మికులకు రోటరీ క్లబ్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున జగిత్యాలలో పలు కూడళ్లలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్ చేతుల మీదుగా జుట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.