KMM: నగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న బాలిక కనిపించకుండా పోయిన ఘటన అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భానుప్రకాష్ కథనం ప్రకారం.. పాండురంగాపురానికి చెందిన 17 ఏళ్ల బాలిక (ఇంటర్) కళాశాలకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రం వరకూ తిరిగి రాలేదు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.