ఖమ్మం రూరల్ వెంకటగిరి క్రాస్ రోడ్డు సమీపంలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద రహదారి గుంతలమయంగా దర్శనమిస్తుంది. సుమారు మోకాళ్ళ మేర రహదారిపై గుంతలు ఏర్పడడంతో ఈ మార్గం గుండా వెళ్లాలంటేనే నరకయాతన పడుతున్నామని స్థానికులు తెలిపారు. అలాగే ఈ గుంతల కారణంగా రాత్రి వేళలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని కోరారు.