శ్రీకాకుళం జిల్లాలో పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో శనివారం నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు పుట్టల వద్ద పాలు పోసి నాగదేవతకు పూజలు చేశారు. మహిళలు పసుపు, కుంకుమలతో నాగదేవతను ఆరాధించి కుటుంబ సుభిక్షం కోసం ప్రార్థనలు చేశారు. కొంతమంది నాగచిత్రాలు గీసి పూజలు నిర్వహించగా, పట్టణాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.