కోనసీమ: వైసీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్, పి.గన్నవరం జడ్పీటీసీ విప్పర్తి వేణుగోపాలరావు నియమితులయ్యారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి ఆదేశాలు వచ్చాయని ఆయన శనివారం ఉదయం విప్పర్తి తెలియజేశారు. తనకు ఈ పదవి ఇచ్చిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.