TG: వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న సీటెట్ నిర్వహించాలని CBSE నిర్ణయించింది. 20 భాషల్లో 132 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని, త్వరలో వివరాలను వెబ్సైట్లో ఉంచుతామని పేర్కొంది. గత కొద్ది సంవత్సరాలుగా సీబీఎస్ఈ ఆధ్వర్యంలో ఏటా జూలై, DECలలో సీటెట్ నిర్వహిస్తున్నారు. చివరిసారిగా 2024 SEPలో నోటిఫికేషన్ జారీ చేసి.. డిసెంబర్ 14న పరీక్ష జరిపారు. గత జూలైలో పరీక్ష నిర్వహించలేదు.