కోనసీమ: కపిలేశ్వరపురం మండలంలోని సత్యనారాయణపురం వద్ద జగనన్న కాలనీ అస్తవ్యస్తంగా తయారయింది. ఇక్కడ సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లబ్ధిదారుల ఇళ్లలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.