WGL: వర్ధన్నపేట మండలం దివిటిపల్లిలో మామిడి తోటలను శుక్రవారం ఉద్యాన శాఖ డివిజన్ అధికారి రాకేశ్ పరిశీలించారు. రైతులకు పూతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. తేనెమంచు పురుగు ఉద్ధృతి ఉన్నందున, ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ, బవిస్టిన్ 2 గ్రా, 13-0-45 10 గ్రా, వేపనూనె 2 మి.లీ కలిపి చెట్టుకు 8-10 లీటర్లు పిచికారీ చేయాలని సూచించారు.