ప్రకాశం: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం కక్కలపల్లికి చెందిన బాలుడు కుమార్ తప్పిపోయినట్లుగా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ రజాక్ గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం కుమార్ తల్లి లక్ష్మీదేవి రావడంతో ఆ బాలుడిని ఆమెకు అప్పగించినట్లు పట్టణ ఎస్సై సైదుబాబు తెలిపారు.