కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు రామచంద్రపురంలోని ఉపాధి భవన్లో జాబ్ మేళా జరుగుతుందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్, భారత్ బయోటెక్, మహీంద్రా & మహీంద్రా ట్రాక్టర్లు కంపెనీలలో ఉద్యోగాలకు ఇంటర్యూ లు ఉంటాయని తెలిపారు.