KMR: జిల్లాలో 49 వైన్స్ షాప్ లైసెన్సుదారుల ఎంపిక కోసం డ్రా ప్రక్రియ OCT 27న నిర్వహించనున్నట్లు ES హనుమంత్ రావు తెలిపారు. ఈ డ్రా OCT 27న ఉదయం 11 గంటలకు KMRలోని రేణుకా దేవికళ్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో జరుగుతుందన్నారు. ఉదయం 9:30 గంటల కల్లా తమ హాల్ టికెట్‌తో హాజరుకావాలన్నారు. లాటరీలో ఎంపికైన లైసెన్సుదారులు ఫీజులో 1/6వ వంతు చెల్లించాల్సి ఉందన్నారు.