HYD: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం DRC సెంటర్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ అధికారులకు సూచించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన DRC సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎంల నిల్వ, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.