SRPT: ఎరువుల కొరత రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం నడిగూడెం మండల కేంద్రంలోని పలు ఎరువుల షాపులను తనిఖీ చేశారు. అనంతరం ఎరువుల దుకాణాల డీలర్లతో మాట్లాడారు. ప్రతి డీలర్ వద్ద లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రైతులకు నాణ్యమైన పురుగు మందులు, ఎరువులు విక్రయించాలన్నారు.