సత్యసాయి: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డికి వన్ ప్లస్ వన్ భద్రత కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో ఆయన భద్రతను రెండుసార్లు తొలగించగా, దీనిపై మధుసూదన రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు భద్రత పునరుద్ధరణకు ఉత్తర్వులు జారీ చేసింది.