E.G: గోకవరం గ్రామ పంచాయతీలో దీపావళి నాడు ఆరుగురు యువకులు మద్యం సేవించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రోడ్డుపై ఉన్న ఫ్లెక్సీలను చించివేయడం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి తహసీల్దార్ రామకృష్ణ ఎదుట హాజరు పరచడం జరిగిందని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. వీరిలో నలుగురు మైనర్ యువకులు ఉన్నారన్నారు.