కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే చవితిని నాగుల చవితి అంటారు. ఇవాళ నాగుల చవితి సందర్భంగా భక్తులు దేవాలయంలోని పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు చేయాలి. పుట్ట మీద పసుపు నీళ్లు చల్లి.. తర్వాత బియ్యపు పిండి, పసుపు, కుంకుమ చల్లాలి. ఆ తర్వాత దీపం వెలిగించి, పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించి పుట్టలో ఆవుపాలు పోయాలి. అనంతరం పుట్ట మీద ఉండే కుంకుమతోపాటు మట్టితో బొట్టు పెట్టుకోవాలి.