PLD: చిలకలూరిపేటలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ సహాయక చర్యల కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పి.శ్రీహరిబాబు ఇవాళ తెలిపారు. చెట్లు కూలడం లేదా ఇళ్లలోకి నీరు చేరడం వంటి ఇబ్బందులు ఏర్పడితే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్ 08647-253994కు సమాచారం అందించాలన్నారు. ఈ మేరకు సిబ్బందిని అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు.