HYD: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. మొత్తం 211 నామినేషన్లలో, 23 మంది ఉపసంహరించుకోగా 58 మంది తుది జాబితాలో నిలిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో ఇంత మంది పోటీ చేయడం ఇదే తొలిసారని తెలిపారు.