NLG: చిట్యాల వ్యవసాయ మార్కెట్ దుకాణ సముదాయాలకు డ్రా పద్ధతిన రిజర్వేషన్ల ఎంపిక జరిపినట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, కార్యదర్శి జానయ్య తెలిపారు. ఎస్సీలకు 5 దుకాణాలు, ఎస్టీలకు 3, బీసీలకు 9, జనరల్ 12, పీహెచ్సీకి ఒకటి చొప్పున మొత్తం 30 షట్టర్లకు రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలిపారు. ఈనెల 25న జరిగే వేలంపాటకు 80 మంది దరఖాస్తు చేశారు.