KNR: హుజూరాబాద్ మండల రైతులు పత్తి పంట మద్దతు ధరకు విక్రయించటానికి రైతుల సౌకర్యం కొరకు ‘కపాస్ కిసాన్’ అనే మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఓటీపీ ద్వారా చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి నిఖిల్ కుమార్ తెలిపారు. రైతులు మొబైల్ యాప్ ఓటీపీ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, వివరాలకు స్థానిక కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.