మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మరో మ్యాచ్ రద్దయింది. కొలంబో వేదికగా శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వర్షం తుడిచిపెట్టింది. ఈ టోర్నీలో శ్రీలంకను వర్షం తీవ్రంగా వెంటాడింది. ఏకంగా 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా, మరో రెండు మ్యాచ్‌ల్లో DLS పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది.