SRKL: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం హెల్ప్ లైన్ నెంబర్ 112పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. టెక్కలి సబ్ డివిజన్ శక్తి టీం ఇన్ఛార్జ్ నారాయణరావు మాట్లాడుతూ..112 అనేది కేవలం పోలీసులకు మాత్రమే కాకుండా, మహిళలు, పిల్లల భద్రత, వైద్య సేవలు, అగ్నిప్రమాదాలు మొదలగు అత్యవసర సేవలకు సహాయం అందిస్తుందని విద్యార్థులకు తెలిపారు.